నల్లకుంటా చెరువులోకి యథేచ్ఛగా రసాయనికి వ్యర్ధ జలాలు వదులుతున్న హెటేరో పరిశ్రమ

Published: Thursday June 10, 2021
దోమడుగు, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : దోమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లకుంటా చెరువుల్లోకి బొంతపల్లి పారిశ్రామిక వాడాలో హెటేరోయూనిట్ 1 పరిశ్రమ నుండి యథేచ్ఛగా రసాయనిక వ్యర్ధజలలను వదలడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలిసి జడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపిడిఓ చంద్రశేఖర్, ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, సీనియర్ నాయకుడు సద్ది విజయ భాస్కర్ రెడ్డి తో కలసి నల్లకుంటా చెరువును పరిశీలించారు. జడ్పిటిసి కుమార్ గౌడ్ మాట్లాడుతూ చెరువులు కుంటాల్లోకి రసాయనిక వ్యర్ధ జలాల వదలడం షరా మాములే, గతంలో కూడా పలు మార్లు ఇదే తంతూ, భూగర్భజలాలను కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పారిశ్రామిక యాజమాన్యంపై ఆయన మండిపడ్డారు. మండలంలోని పలు పరిశ్రమలు చినుకు పడితే చాలు రసాయనిక వ్యర్ధాలు బయటకు వదలడంతో ఇక్కడి చెరువులు, కుంటలను కాలుష్యమైయం చేస్తు, ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ పరిశ్రమపై కాలుష్య నియంత్రణ మండలి వారు హెటేరో పరిశ్రమపై తగిన కఠిన చర్యలు చేపట్టాలని, అలాగే నల్లకుంటా చెరువు పూర్తిగా కాలుష్యంతో నిండిపోయిందని, దీనికి తగు పరిష్కరం చూపాలని ఆయన డిమాండ్ చేశారు... ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామిరెడ్డి, వార్డు సభ్యులు సుధాకర్ రెడ్డి, నాయకులు మంగయ్య తదితరులు పాల్గొన్నారు