తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి కుమారుడు కిరణ్ డిమాండ్

Published: Saturday December 24, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: తన తండ్రి సంగర్తి శంకర్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగర్తి శంకర్ కుమారుడు సంగర్తి  కిరణ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు, మంచిర్యాల జిల్లా
భీమిని మండల కార్యాలయంలో సూపరింటెండెంట్ గా  పనిచేస్తూ గత జూన్ లో గోదావరిఖనివద్ద, గోదావరిలో దూకి మా తండ్రి ఆత్మహత్య కు పాల్పడినాడని,  పోలీసులు తనకు తెలుపగా  తాను తన తండ్రి మృతదేహాన్ని తీసుకెల్లి అంత్యక్రియలు చేసుకోవడం జరిగిందనీ,ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని తన ఇంటిలో వస్తువులు తీసుకెళ్దామని వచ్చి తన తండ్రి దుస్తులు చూస్తుండగా తన తండ్రి రాసిన సూసైడ్ నోట్ దొరికిందనీ అన్నారు. అందులో తన మరణానికి కారణం, భీమినీ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కే, లలిత కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న రాధాకృష్ణ, మంచిర్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సి, సత్యనారాయణ  పేర్లు ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. మా నాన్న మృతికి కారణమైన పై అధికారులపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని, న్యాయపరంగా తనకు రావలసిన తన తండ్రి ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.