ఘనంగా కొయ్యల ఏమాజి జన్మదిన వేడుకలు

Published: Friday February 11, 2022
మంచిర్యాల బ్యూరో, పిబ్రవరి10, ప్రజాపాలన : భారతీయ జనతాపార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ కొయ్యల ఏమాజి జన్మదిన వేడుకలను స్థానిక ఆగర్వాల్ భవన్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ఆయనను ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభిలసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోయిల్కర్ గోవర్ధన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవరెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్రీనివాస్ నాయక్, పట్టణ కౌన్సిలర్ అనిత రాజులాల్ యాదవ్, మండల అధ్యక్షులు, రామన్న, భీమన్న, శైలేందర్ సింగ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల మోహన్ మహిళ కార్యకర్తలు, తిరుమల, ఉదయ, తార భాయ్, నాయకులు శనిగారపు శ్రావణ్, రాజేష్, అనిల్, ప్రశాంత్, రవి కుమార్, రంగు కుమార్, శ్రీరాములు శ్రీనివాస్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.