పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Published: Wednesday September 28, 2022

మధిర సెప్టెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధిప్రజలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం తోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మధిర అడిషనల్ సిడిపిఓ వీరభద్రమ్మ పేర్కొన్నారు. మండల పరిధిలోని  ఆత్కూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికి అంగన్వాడీ కేంద్రాలలో బరువు, ఎత్తు, పోషక స్థాయిలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా తల్లులకు తక్కువ ఖర్చుతో పిల్లలకు అందించే పోషకాహార పదార్థాల గురించి అవగాహన కల్పించారు. లోప పోషణ ఉన్నటువంటి పిల్లలకు ఆకలి పరీక్షలను నిర్వహించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. పోషణ మాసం సందర్భంగా ఈనెల1వ తేదీ నుండి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాలతి అంగన్వాడీ టీచర్ జాలమ్మ ఆశా కార్యకర్త దివ్య తదితరులు పాల్గొన్నారు.