మాల మహానాడు జాతీయ బృందం రెండవ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటన.

Published: Saturday November 20, 2021
హైదరాబాద్ 19 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి హాజరైనారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 'హలో మాల-చలో ఢిల్లీ' కార్యక్రమం డిసెంబర్ 5 నుంచి ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా 'హలో మాల-చలో ఢిల్లీ' అనే కరపత్రం ను ఆవిష్కరణ చేశారు. చెన్నయ్య  మాట్లాడుతూ కాలంచెల్లిన సుప్రీంకోర్టు తీర్పును పట్టుకొని అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల మాదిగలను విడదీయాలని కొన్ని రాజకీయ పార్టీలు  కుట్రలు పన్నుతున్నాయని ఆవిషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. తదుపరి  తాళ్లపల్లి రవి  మాట్లాడుతూ  జి.చెన్నయ్య  నాయకత్వంలో తెలంగాణ లోని అన్ని జిల్లాల మాల మరియు మాల ఉపకులాల కార్యకర్తలు ఢిల్లీకి పయనం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్యాగరి చెన్నయ్య, సీనియర్ నాయకులు తలారి కాశన్న, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కావలి రమేష్, కోశాధికారి కావలి హనుమంతు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  జెట్టి వెంకటేష్, మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.