మహాదేవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే రాములు నాయ

Published: Tuesday May 25, 2021
ఖమ్మం మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : కొనిజర్ల: మండల కేంద్రంలో వెలసిన స్వయంభు మహాదేవ లింగేశ్వర ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహెూత్సవంలో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రూ. 1.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయంలో గత నాలుగు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావూడ్య రాములు నాయక్ తో కలిసి మాజీ ఎంపీ పొంగులేటి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల ఆశీర్వాదాలను తీసుకున్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడి పంటలు, పశు సంపద సమృద్ధి చెందాలని పరమ శివుడిని పొంగులేటి ప్రార్ధించారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి త్వరగా ప్రజలకు ఉపశమనం కలిగించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, వైరా జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, కొణిజర్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, వైరా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుపులేటి మోహన్ రావు, స్థానిక సర్పంచ్ సూరంపల్లి రామారావు, ఎంపీటీసీలు సూరంపల్లి సుశీల, కొనకంచి స్వర్ణలత, సొసైటీ చైర్మన్ చెరుకుమళ్ల రావి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు రాయల పుల్లయ్య, కొత్తపల్లి శేషగిరిరావు, కొనకంచి మోషే, పరికపల్లి రామారావు, కన్నెకంటి రావు, వట్టికూటి సైదులు గౌడ్, కటుకూరి నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.