అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం

Published: Saturday April 08, 2023

రాయికల్ ,ఏప్రిల్ 07;(ప్రజాపాలనప్రతినిధి): రాయికల్ మండలములోని తాట్లవాయి గ్రామంలో గుట్టపై కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా కమనీయంగా,కన్నుల పండుగగా మంగళ వాయిద్యాలతో భక్తుల కోలహాలాల మధ్య ఆలయ అర్చకులు వేదమంత్రాలు చదువుతుండగా శ్రీ స్వామివారి రథోత్సవం నిర్వహించారు. చైత్రమాస పౌర్ణమి నాడు(గురువారం) రాత్రి నుంచి జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులు గుట్టపైకి కాలినడకన జైశ్రీరామ్! తాట్లవాయి రామస్వామి గోవిందా! అంటూవెళ్లి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని,తీర్థప్రసాదాలు స్వీకరించి,గుట్టపైన స్వామివారి ఆలయం ప్రక్కన ఉన్న కోనేరుతీర్థం(లొంక తీర్థం)తీసుకుని,నాలబోయారం గుండా (రెండు పెద్దరాయి గుండ్ల మధ్య దారి) క్రిందికి వచ్చి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్, తాట్లవాయి రామస్వామి గోవిందా ! అంటూ రథాన్ని లాగారు.గుట్ట కింద ఉన్నమామిడి తోటలలో భక్తులు కుటుంబ బంధువులతో కలిసి వంటావార్పు చేసుకుని వనభోజనాలు చేశారు.