మండల బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

Published: Tuesday June 07, 2022
ప్రజల విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆడపిల్లకు న్యాయం చేయండి - కాలసాని పరశురాం
 
బోనకల్, జూన్ 6 ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక పైన టిఆర్ఎస్- ఎంఐఎం నాయకుల కొడుకులు చేసిన గ్యాంగ్ రేప్ ను ఖండిస్తూ భారతీయ యువ మోర్చా పిలుపుమేరకు బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాటం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమైన బిజెపి నాయకులను పోలీస్ వారు అర్ధాంతరంగా హౌస్ అరెస్టు చేస్తూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం భారతీయ జనతా యువమోర్చా నాయకులు కారంగుల మురళీకృష్ణ కాలసాని పరశురాం లు మాట్లాడుతూ నిందితులు ఎంతటివారైనా ఎటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న కఠినంగా శిక్షించాలని ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం కు చేతకాకపోతే సీబీఐకు కేసును అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మరీదు పరశురాముడు, యువనేత బీపీ నాయక్ లు పాల్గొన్నారు.