బెల్లంపల్లిలో రావణాసుర వధ కార్యక్రమం జరిగేనా ?

Published: Wednesday October 13, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల అనంతరం దసరా పండుగ రోజున జరిగే రావణాసుర వధ కార్యక్రమం బెల్లంపల్లి పట్టణంలో జరిగేనా? అని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో ప్రతి సంవత్సరం స్థానిక తిలక్ స్టేడియంలో దసరా పండుగ రోజున రావణాసుర వధ కార్యక్రమం స్థానిక  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు పట్టణ వర్తక సంఘం వారి సహకారంతో రావణాసుర వధ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. గత కొద్ది సంవత్సరాల క్రితం కొన్ని దళిత వర్గాల ఆక్షేపణలతో రావణా సుధ వధ కార్యక్రమం జరపకుండా ఆగి పోయింది, అది ఈ సంవత్సరం తిరిగి జరపడానికి స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నా అది జరిగే వరకు ప్రశ్నార్థకంగానే ఉందని స్థానిక ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మందమర్రిలో రావణాసుర వధ జరపకూడదు అంటూ స్థానిక జి ఎం కి ఆక్షేపణ పత్రాలు అందినట్లు తెలిసింది, ఈ పరిస్థితుల్లో బెల్లంపల్లి లో కూడా జరుగు తాయో లేదో వేచి చూడాల్సిందే. ప్రజలు అనుకుంటున్నారు.