దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్ హెచ్ ఓ. ఐపీఎస్ ఆఫీసర్స్ సంకీర్త

Published: Saturday May 28, 2022

మధిరమే 27 ప్రజా పాలన ప్రతినిధిమున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం  ఎస్ హెచ్ ఏ పీ ఎస్ ఆఫీసర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి
ఊరికి వెళ్లే వాళ్ళు ఇంటి పక్కన వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలు, నగలు ఉంచి వెళ్ళవద్దు.అనుమానం వచ్చిన, దొంగల అలికిడి ఉన్న వెంటనే ఏ సమయంలోనైనా 100 కి కాల్ చేయండి.*మధిర టౌన్ ఎస్ హెచ్  ఓఐపీఎస్ ఆఫీసర్ సంకీర్త్.*మధిర టౌన్ పరిధిలో గత కొద్ది రోజులుగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా మీరు ఊరికి వెళ్లేటప్పుడు మీ పక్కన వారికి కానీ పోలీసులు గాని సమాచారం ఇచ్చి వెళ్లాలని మధిర టౌన్ ఎస్ హెచ్ ఓ, ఐపీఎస్ అధికారి  సంకీర్త్ పేర్కొన్నారు. గత రాత్రి సాయిబాబా గుడి రోడ్ లో చలవాది అప్పారావు ఇంట్లో దొంగలు పడిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారి  మాట్లాడుతూ ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు నగదు వదిలి వెళ్లవద్దని సూచించారు. రెండు మూడు రోజులు వేరే ఊర్లో ఉండాల్సి వస్తే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా రాత్రిసమయాల్లోఅనుమానాస్పదంగా కల్పించిన, దొంగల అలజడి గుర్తించిన వెంటనే 100  నెంబర్కు కాల్ చేయగలరు అని తెలిపారు. దొంగతనాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు.