వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ

Published: Monday June 06, 2022

కోరుట్ల, జూన్ 05 (ప్రజాపాలన ప్రతినిధి):
గత నలభై రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కాల క్రీడా శిక్షణ ముగింపు కార్యక్రమంలో కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు  మచ్చ రాఘవేంద్ర ఆదివారం రోజున 20 మంది వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ   కార్యక్రమంలో రాఘవేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రౌండు వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల గోపి, కార్యదర్శి కారపు శ్యాంసుందర్, సలహాదారులు మచ్చ రామకృష్ణ ,వాకర్ సభ్యులు మోటూరి ప్రవీణ్ కుమార్, సంకు రవి, చింతకింది ప్రదీప్, సిరిపురం సతీష్, ముక్క రాంప్రసాద్, పడిగెల పవన్, తాళ్ల పెళ్లి సత్యనారాయణ, మహమ్మద్ షబ్బీర్ ,పడాల శివ, పిన్నం శెట్టి శ్రీధర్ ,తదితరులు పాల్గొన్నారు.