దళితుల అభ్యున్నతి కోసం పాటు పడిన వ్యక్తులు డా. అంబేడ్కర్ మరియు డా.బాబు జగజ్జివన్ రావు డా.కోట ర

Published: Tuesday January 25, 2022
ఎర్రుపాలెం జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్ మరియు డా.బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల నిర్మాణ, భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.కోట రాంబాబు హాజరై విగ్రహాల నిర్మానాణికి కొబ్బరికాయ కొట్టి శంకుస్తాపన చేశారు. అనంతరం అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా.కోట రాంబాబు గారు మాట్లాడుతూ. గ్రామంలో ప్రముఖులు విగ్రహాలు ఏర్పాటు చేయటం సంతోషం అని అన్నారు. అలాగే గ్రామములో వున్న యువత అందరూ కూడా చైతన్యం కలిగి అన్ని రంగాలలో ముందు ఉండాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బహుకరించినటువంటి కూరపాటి ప్రభాకర్ కుటుంబ సభ్యులను అభినందించారు. కూరపాటి ప్రభాకర్ తాత గారు అయినటువంటి కూరపాటి పెద్ద ఏసోబు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశాడు. అనంతరం ఇటీవలే అనారోగ్యం పాలైన గ్రామ సర్పంచ్ సుందరమ్మ గారిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డీసీసీబీ డైరెక్టర్ భద్రాచలం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, గ్రామ సర్పంచ్ కూరపాటి సుందరమ్మ, కోటేశ్వరరావు, ఎంపిపి దేవరకొండ శిరీష, జడ్పీటిసి శీలం కవిత, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు శీలం వెంకట్రామిరెడ్డి, ఎంపిటిసి కూరపాటి యశోద, శీలం శ్రీనివాస రెడ్డి, జాగృతి నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిల్లపాటి బాబురావు, శీలం నర్సిరెడ్డి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్, ఎం ఎస్ ఎఫ్ నాయకులు కూరపాటి సునీల్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేకల రమేష్, ప్రతాప్ రెడ్డి, విగ్రహ దాత కూరపాటి వెంకటరత్నం, దేవరకొండ చిరంజీవి, గట్టిగుండే కిషోర్, కమలాకర్, పుల్లారావు మరియు కమిటీ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.