కరోనా కారణంగా ఇబ్బందిపడుతున్న గెస్ట్ లెక్చర్లు

Published: Saturday July 03, 2021
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీగెస్ట్ లెక్చరర్ల బోధించవలసి సబ్జెక్టును సందేహాలను నివృత్తిని ఎవరు చేయాలి అన్న ప్రశ్నకు ఇంటర్మీడియట్ బోర్డ్ దగ్గర సమాధానం లేదని చెప్తున్న లెక్చరర్కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 16 నెలలు జీతాలు లేక కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వనికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన వీరి గోస పట్టించుకునే వారు కనిపించడం లేదు. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1658 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించిన ప్రభుత్వం, ఇంటర్మీడియట్ లో పనిచేస్తున్నటు వంటి గెస్ట్ లెక్చరర్లను మినహా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎంటియస్, అవుట్ సోర్సింగ్ వంటి వారందరినీ రెన్యువల్ చేసి ఆన్ లైన్ క్లాస్ ల పర్యవేక్షణ చేస్తుంది. మరి గెస్ట్ లెక్చరర్లు భోదించవలసిన సబ్జెక్ట్ లలో వచ్చే సందేహాల నివృత్తి కి విద్యార్థి ఎవరిని సంప్రదించాలి అన్న ప్రశ్నకు ఇంటర్ బోర్డు దగ్గర సమాధానం లేదు. వ్యవస్థ ప్రారంభమైంది ఇలా. 2011లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. ఆ తరువాత 2013 లో ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి పార్ట్ టైం హవర్లి బేస్డ్ లెక్చరర్ అనే వ్యవస్థకు పేరు మార్చి గెస్ట్ లెక్చరర్ అనే కొత్త వ్యవస్థను సృష్టించింది. వీరికి 2016 వరకు నెలకు 72 పీరియడ్ లు మించకుండా పీరియడ్ కు 150 /- చొప్పున నెలకు 10800/- చెల్లించే వారు. ఆతరువాత 2017 సంవత్సరం నుండి వీరి జీతం నెలకు 72 మించకుండా పీరియడ్ కు 300/- చొప్పున 21600/- చెల్లిస్తున్నారు. వీరు పేరుకే గెస్ట్ లెక్చరర్లు అయినప్పటికీ మిగతా రెగ్యులర్, ఎంటీయస్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గుర్తింపుదక్కడంలేదు క్లాసులు చెప్పడమే కాకుండా ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ 10 వ తరగతి పాస్ అయిన విద్యార్థులను కలిసి ప్రభుత్వ కాలేజ్ పనితీరు వివరించి అడ్మిషన్ ల పెంపు కై  కృషీ చేస్తున్నారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ లో ఆన్ లైన్ క్లాస్ లో క్లాస్ లు ప్రారంభించిన ప్రభుత్వం వీరిని రెన్యువల్ చేయకపోవడంతో వీరు పలు మార్లు మంత్రులను, శాఖధిపతులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు 2021 ఫిబ్రవరిలో రెన్యువల్ చేసి, కేవలం 3 నెలలు మాత్రమే కొనసాగించింది. ఆ జీతం కూడా ఇప్పటి వరకు అందకపోవడంతో గెస్ట్ లెక్చరర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ని ఆదుకున్న ప్రభుత్వం, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి వీరిని పట్టించుకోక పోవడం దారుణం. వీరికి వెంటనే ఆటో రెన్యువల్ ఉత్తర్వులు ఇచ్చి జూలై 1 నుండి ప్రారంభమై ఆన్ లైన్ క్లాస్ లలో భాగస్వామ్యం చెయ్యాలని ,పీరియడ్ విధానం తొలగించి ఫిక్స్డ్ మంత్ సాలరీ ఇవ్వాలని గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు.