అభివృద్ధికి ఆమడ దూరం ధర్మాపూర్

Published: Monday August 29, 2022
మాజీ వైస్ ఎంపీపీ బిచ్చిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 28 ఆగస్టు ప్రజా పాలన : పల్లెలు పురోగతి సాధిస్తేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి పల్లె ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఆలోచించి పల్లె ప్రగతిని ప్రవేశపెట్టారు. ప్రతి పల్లెకు స్టేట్ ఫైనాన్స్ 15వ ఆర్థిక నిధులు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు మంజూరు అవుతున్నాయి. గ్రామ ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులు అధికారులు కలిసి గ్రామాభివృద్ధికి ఈ నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళికలను తయారు చేసుకోవాలి. ప్రణాళిక అబద్ధంగా ప్రతి పనిని సక్రమంగా ప్రదోపయోగంగా చేపట్టాలి కానీ కొందరు ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామాభివృద్ధి చేపట్టాల్సిన ప్రజాప్రతినిధులు అధికారులే ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. నిధులు ఉన్న అభివృద్ధి పనులు చేపట్ట లేక చతికిల పడుతున్నారు. ధారూర్ మండల పరిధిలోని ధర్మాపూర్ గ్రామములో ఏ వీధి చూసిన బురదతో కూడిన రోడ్లు దర్శనమిస్తాయి. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్న చందంగా వ్యవహరిస్తున్న ప్రజా ప్రతినిధులు అధికారులు. పొలాలకు వెళ్లే పానాది రోడ్లు వర్షాకాలంలో బురదమయంగా మారి నడవలేని స్థితి దాపురించింది. పానాది రోడ్ల నుండి ట్రాక్టర్ వెళ్లలేక బురదలోనే కూరుకుపోయి ఉన్నదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కాలిబాటన కూడా వెళ్లలేని స్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడున్నర సంవత్సరాల పదవీకాలం పూర్తి కావస్తున్నా అభివృద్ధి పనులు చేపట్టకపోవడం విచారకరమని గ్రామస్తులు వాపోతున్నారు. మున్నూరు సోమారానికి అనుబంధ గ్రామంగా ఉన్న ధర్మాపూర్ గ్రామం నూతన గ్రామపంచాయతీ గా ఏర్పడింది. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో సాక్షిభూతంగా నిలిచింది. పల్లె ప్రగతిలో భాగంగా స్మశాన వాటిక పారిశుద్ధ్యం నర్సరీ హరితహారం అంతర్గత రోడ్లు ఫార్మేషన్ రోడ్లు సైడ్ డ్రైనేజీల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. స్మశాన వాటికకు రాకపోకలు సాగించడానికి సక్రమంగా రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది గ్రామ పారిశుద్ధ్య పనులను తడి పొడి చెత్తను సేకరించడానికి జిపి గ్రామ సిబ్బంది అనునిత్యం పనిచేయాలి. పారిశుధ్యం పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రతి వీధిలో కంపు కొడుతుందని వివిధ వార్డు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తడి పొడి చెత్త సేకరించడానికి వారానికి రెండు రోజులు మాత్రమే కొన్ని వార్డులలో సేకరిస్తుంది. నడి ఊరిలో పాడుబడ్డాయి ఇండ్లు ఉన్నప్పటికీ వాటిని కూల్చడానికి ప్రజాప్రతినిధులు అధికారులు ముందుకు రావడం లేదని చుట్టుపక్కల నివాసాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాడు గూడపు అంజయ్య కలవలేని నివాసాలలో విషపురుగులు చేరి చిన్నారుల పాలిట శాపాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గూడపు అంజిలిరెడ్డి గూడెం భీమ్ రెడ్డి గూడెం పద్మావతి గవ్వల సత్యమ్మ ఇల్లు పాడుబడినప్పటికీ నేలమట్టం చేయలేదని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. గవ్వల మల్లయ్య ఇంటిదగ్గర పెద్ద గుంత ఉన్నప్పటికీ ఇంతవరకు దాన్ని పూర్చకపోవడం విచారకరమన్నారు. సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 
 
 
 
Attachments area