అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి ఎద్దుల బలప్రదర్శన పోటీలు. పోటీలను ప్రారంభించిన పాలేరు ఎ

Published: Saturday November 05, 2022
పాలేరు నవంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి.
నేలకొండపల్లి
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలంలోని
 
రాజేశ్వరపురంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన | పోటీలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ పోటీలను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పోటీలను
 
ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఎద్దులు పోటీకి వచ్చాయి. ఎమ్మేల్యే తల్లిదండ్రులు కందాళ నర్శింహారెడ్డి- మోహినిదేవి. ల జ్ఞాపకార్ధం బహుమతుల కోసం నిర్వహణ కమిటి కి రూ.4 లక్షలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో ఎన్నో ఏళ్లగా అనవాయితీగా కార్తీక మాసంలో పోటీలు నిర్వహించటం
 
సంతోషంగా ఉందని అన్నారు. పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్నీ వెస్.
చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ నెల్లూరి
 
లీలాప్రసాద్, ఎంపీపీ వజ్జా రమ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి
 
శ్రీనివాసరావు, రైతు సమన్వ సమితి అధ్యక్షుడు శాఖమూరి
సతీష్,
సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు గండు సతీష్, టీఆర్ఎస్
 
మండలాధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు,
 
నిర్వహణ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.