రాజకీయాల్లోకి మేధావులు రావాలి డాక్టర్ మద్దెల ప్రసాదరావు

Published: Wednesday July 13, 2022

మధిర రూరల్ జులై 12 ప్రజాపాలన ప్రతినిధి: రాజకీయాల్లోకి ఉన్నత చదువులు చదువుకున్న మేధావులు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నదని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రిటైర్డు సిఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తమిళనాడు శాఖ నుండి డాక్టరేట్ అందుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావుని మంగళవారం చింతకాని వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాదరావు మాట్లాడుతూ రాజకీయాల్లోకి విద్యావంతులు వచ్చి మేధావులు చట్టసభల్లోకి ప్రవేశించినప్పుడు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. అవినీతి రహిత పాలన ప్రజలకు అందాలంటే తప్పనిసరిగా చట్టసభల్లో మేధావులు ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి ప్రవేశించకపోవడంతో ప్రజలకు కొంత నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులు చట్టసభలో ఉంటే ప్రభుత్వాలు రాజ్యాంగాలకు విరుద్ధంగా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ చింతకాని మండల అధ్యక్షుడు వాకా వీరారెడ్డి మాట్లాడుతూ మద్దెల ప్రసాద రావు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి సీఐగా పదోన్నత పొంది ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వాల చేత అనేక అవార్డులు పొందారని ఆయన గుర్తు చేశారు. సీఐగా పని చేసి పదవీ విరమణ పొందిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విధానాలు నచ్చి ఆయన కుమార్తె వైయస్ షర్మిల తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరి ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. వైయస్సార్ తెలంగాణ ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మద్దెల ప్రసాదరావుకి డాక్టరేట్ అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆనం లక్ష్మారెడ్డి, చల్లా రామిరెడ్డి, కన్నెబోయిన రామకృష్ణ, సారిక కృష్ణ ప్రసాద్ ,బక్క సత్యమూర్తి, ఎర్రమల ప్రసాద్, రెంటాల శాంతకుమారి, గురజాల మాధవరావు, శ్రీరాముల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.