తెలంగాణ సాధన కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు జయశంకర్

Published: Saturday August 07, 2021
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 ఆగస్ట్ ప్రజాపాలన : నీళ్ళు, నిధులు, నియామకాల ఆవశ్యకత కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాధన అనంతరం కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. కొత్త జిల్లాలో అధికారులు సిబ్బంది అందరు బంగారు తెలంగాణ కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తరువాత త్రాగు నీరు, సాగు నీరుతో పాటు వివిధ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పలుపంచుకొని బంగారు తెలంగాణ సాధనకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.