యువత స్వయం ఉపాధి వ్యాపార రంగాలలో రాణించాలి* -రియల్ ఎస్టేట్ న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసిన ఎ

Published: Monday December 05, 2022

చేవెళ్ల డిసెంబర్ 04,(ప్రజాపాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలో  ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్  గుట్టల శేఖర్ నూతన   గ్రీన్ ల్యాండ్,
రియల్ ఎస్టేట్, న్యూట్రిషన్  సెంటర్ ను  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య,దళితరత్న అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్ ,ఏఎంసీ చైర్మన్  మిట్ట వెంకటరెడ్డిలు కలిసి ప్రారంభించారు.గుట్టల శేఖర్ ను వారు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం  కాలే యాదయ్య ఏం మాట్లాడుతూ  యువత స్వయం శక్తితో స్వయం ఉపాధితో ముందుకు సాగాలని అన్నారు. యువత ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అని, సంకల్పం, బలంగా ఉంటే భవిష్యత్తు యువత దేనని అన్నారు. ఒకవైపు జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తూ మరో పక్క వ్యాపారం  రియల్ ఎస్టేట్ ,స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపుడం  హర్షింపదగ్గ విషయమని  అన్నారు.  ఈ సందర్భంలో బురాన్ ప్రభాకర్ మాట్లాడుతూ  యువకులు ఉద్యోగుల కోసం నిరీక్షిస్తూ  సమయాన్ని వృధా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని అన్నారు. ఉపాధి పొందటంతో పాటు నలుగురికి కల్పించిన వారవుతారని,
యువత  స్వయం  ఉపాధి వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలతి కృష్ణా రెడ్డి,ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి,వైస్ ఎంపీపీ కర్నె శివ ప్రసాద్,తెరాసా మండల ప్రెసిడెంట్ పెద్దోళ్ల ప్రభాకర్, చేవెళ్ల పాత్రికేయులు, అడ్వకేట్ గుట్టల చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.