తెలుగుదేశం పార్టీ ద్వారానే సామాజిక న్యాయం:- కొంగర విష్ణువర్ధన్ రెడ్డి

Published: Wednesday March 30, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమన్ని గ్రామ అధ్యక్షుడు ఎన్నిదుల సురేష్ ఆధ్వర్యంలో జెండావిష్కరించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతనే తెలుగు ప్రజలకు రాజకీయంగా, ఆర్థికంగా చేతన్యం తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాల అబివృద్దికి కృషిచేసింది, తెలుగు ప్రజలకు దేశ విదేశాలలో గుర్తింపు తెచ్చింది, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న లక్ష్యంతో కుల మత ప్రాంతాల సమ్మేళనమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. పార్టీ అభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేయాలని అన్నారు.  తదనంతరం పండ్ల పంపణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు ఆనంగాళ్ల యాదయ్య, మెగావత్ మోహన్ నాయక్, నుకం సత్తయ్య, గుడ్డిమల్ల చంద్రయ్య, సాతిరి ఎల్లేశ్, సుంకరి ప్రవీణ్, పొలమోని అనిల్ రాజు, వస్పరి కుమార్, పంబల శివకుమార్, కొంగర వెంకట్ రెడ్డి, కొంగర శేఖర్ రెడ్డి, సిద్దగోని రమేష్, మద్దెల రాజు, మెగావత్ లక్మ నాయక్, గడ్డం అశోక్, గొల్లపల్లి అంజయ్య, బత్తుల రాజు, ఆమంచ జగన్, ఉదరి దర్శన్, మంకు జంగయ్య, కావలి దర్శన్, మడపాకుల శేఖర్, కాసుల పాండు, ఆడెపు రమేష్, మడపాకుల యాదయ్య, వెంకటేష్, క్రిష్ణ, బాలం బీరప్ప, చిందం కృష్ణ, రావుల సైదులు, ఓరిగంటి మహేష్, నుకం నర్సింహా, బల్ల జంగయ్య, ఓరిగంటి శ్రీనివాస్, మొద్దు కిషోర్ రెడ్డి, లొంగరి దశరథ, కాసుల అంజయ్య, కావలి బుచ్చయ్య, జిట్టామోని యాదయ్య, పొలమోని మహేందర్, దూసరి రాజు, దాసరమోని రాజు, ఎండి. అష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.