నిరుద్యోగ యువత అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలి **

Published: Thursday December 15, 2022
అదనపు కలెక్టర్ చహత్ బాజ్పాయి **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 14 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో ఐక్యూ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులు విద్యార్థులకు అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  
అదనపు కలెక్టర్ చహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం ఆమె శిక్షణ శిబిరాన్ని సందర్శించారు.
విద్యార్థులతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఐక్యూ మైండ్స్ సంస్థ పనిచేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యూ మైండ్స్ ఆధ్వర్యంలో అందిస్తున్న కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఉత్తర తెలంగాణలో యువతకు, విద్యార్థులకు ఐక్యూ మైండ్స్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో విద్యార్థులకు యువతకు ఉపాధి శిక్షణ మరింత మెరుగుపరిచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం ఆమెకు సంస్థ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ మైండ్స్ సీఈవో
 మొహమ్మద్,, యాసీన్ ,అధ్యాపక బృందం  తదితరులు పాల్గొన్నారు.