వ్యవసాయ సహకార సంఘం దీర్ఘకాలిక రుణాలు పంపిణీ

Published: Wednesday January 12, 2022

బీరుపూర్, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున దీర్ఘకాలిక రుణాలను సంఘ పరిధిలోని ఎనిమిది మంది సభ్యులకు రూ.23 లక్షల 60 వేలు రూపాయలను పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ ఆర్.ఎన్.డి మొయిజ్ పాషా సహకార సంఘం అధ్యక్షులు ఏలేటి నరసింహారెడ్డి సీఈవో ఎండి ఇస్మాయిల్ సంఘ డైరెక్టర్ లు మరియు సభ్యులు పాల్గొన్నారు.