నిస్వార్థమైన సేవలోనే నిజమైన సంతృప్తి - తెలంగాణ ట్రేడ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివ

Published: Tuesday April 04, 2023

నిస్వార్థంగా చేసే సేవలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని తెలంగాణ ట్రేడ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  వినికిడి సమస్య తో బాధ పడుతున్న సుమారు లక్ష యాభై వేల మందికి వినికిడి యంత్రాలు అందజేసి తన దాతృతానికి చాటుకున్న నీలపు వెంకటరత్నాన్ని ఘనంగా సన్మానించారు. సేవ ఆటోమేటివ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఎండీగా విధులు నిర్వహిస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎంతోమందికి సేవా కార్యక్రమాలు నిర్వహించిన నీలపు వెంకటరత్నాన్ని సన్మానించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎలాంటి స్వచ్ఛంద సంస్థ ప్రారంభించకుండా  స్వయంగా సేవలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. తన చిన్ననాటి నుంచే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి చేయూత అందించడం అలవాటుగా మారిందని వెంకటరత్నం అన్నారు. తన వంతుగా సమాజానికి సేవలు చేయాలని నిర్ణయించుకుని లక్ష యాభై వేల మందికి పైగా అందించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించిందని చెప్పారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెంకటరత్నం తెలిపారు.