జియో అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి

Published: Thursday February 23, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 ఫిబ్రవరి ప్రజాపాలన : జియో అటెండెన్స్ యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ డౌన్ లోడ్ చేసుకుని రేపటి నుండి  వంద శాంతం హాజరును యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, అటెండెన్స్ యాప్ ను రేపటి నుండి పకడ్బందీగా అమలు చేయాలని దీని ఆధారంగానే సిబ్బందికి వచ్చే నెల నుండి జీత భత్యములు అందించడం జరుగుతుందన్నారు.  అటెండెన్స్ యాప్ షీట్ ఆధారంగానే సిబ్బంది జీతాలు క్లెయిమ్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.  అలా కాకుండా జీతాలు క్లెయిమ్ చేసినట్లయితే సంబంధిత అధికారుల జీతాల నుండి సిబ్బందికి చెల్లించిన జీతాలను రికవరీ చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తదితర శాఖలలో ఇంకా చాలా మంది సిబ్బంది అటెండెన్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోలేదని, వారందరినీ వెంటనే యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.