శివంపేట మహిళా నైపుణ్యాభివృద్ధి కేంద్రంకు తీరని బాలారిష్టాలు

Published: Wednesday December 15, 2021
హైదరాబాద్ 14 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: మహిళా నైపుణ్యాభివృద్ధి కేంద్రం కు తీరని కష్టాలు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలోని మహిళా నైపుణ్యాభివృద్ధి  కేంద్రం (ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) కు ఆరంభం లోనే బాలారిష్టాలు. ఆగిన పనులు. స్థలం కేటాయించడంలో ఆలస్యం జరిగింది. దీనితో పని ఆలస్యంగా ప్రారంభించబడిందన్నారు. కాంట్రాక్టర్ తో పక్కనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మార్చడం దానికి దిమ్మ కట్టించడం జరిగిందన్నారు. 11 కెవి విద్యుత్ వైరు అడ్డుగా ఉండడంతో బిల్డింగ్ స్లాబ్ సెంట్రింగ్ పని ఆగిపోయిందని సంబంధిత అధికారులతో ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్తు శాఖ కు సంబంధిచిన అధికారులకు విజ్ఞప్తి చేశామని సర్పంచ్ తదితరులు ప్రయత్నాలు చేసినా లైన్ మార్చ లేదని అన్నారు. దీని వల్ల బిల్డింగ్ పని ఆలస్యం అవుతుందన్నారు. స్థానిక  ప్రజాప్రతినిధులు చోరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.