తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి బషీరాబాద్ మండల సర్వ సమావేశం సాదాసీదాగా ప్రశాంతంగా ముగిసింది

Published: Saturday October 29, 2022

అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించుటకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని  బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలను క కరుణ ఆ జయప్రసాద్ అన్నారు. బషీరాబాద్ మండలంలో అధికారులు సెలవు పెట్టి వెళ్లడం బాధాకరమని ప్రజాప్రతినిధులు వారిని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించి వారితో పనులను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇబ్బందులను  గౌరవంగాపనులు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండా వని బషీరాబాద్ మండల అధ్యక్షురాలు అన్నారు.  బషీరాబాద్ గ్రామంలో సెక్రటరీ లీవ్ పై వెళ్లడం వెనుక ప్రజాప్రతినిధులు ప్రజలు చట్టవిరుదంగా రూల్స్ వ్యతిరేకంగా విధులు నిర్వహించమని డిమాండ్ చేస్తున్న ఉన్నందున సేలువుపై వెళ్తున్నారని ఆయన ఆవేదనం చేశారు .వారు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే వారు ఉద్యోగాలు ఊడుతాయని  వెళ్తున్నారని అన్నారు. బషీరాబాద్ గ్రామంలో రూల్స్ ను పాటించడం లేదని రుసును గౌరవించడం లేదని అనేక అక్రమాలు అవినీతి జరిగిందని ఉద్దేశంతో ఆయన మాట్లాడారు బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కే రాజరత్నం మాట్లాడుతూ బషీరాబాద్ లో విద్యార్థుల కోసం బస్సును నడపాలని గ్రామం చుట్టూ బస్సు నడపాలని ఆయన ఆర్టీసీ అధికారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వంశీకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి పనులు చురుకుగా జరుగుతున్నాయని అజెండా చదివి వినిపించారు. శిశు సంక్షేమం ఉపాధి హామీ చంద్ర క్రాంతి డి ఆర్ డి ఏ అధికారులు అంగన్వాడి అధికారులు అజెండాలో ఉన్న వివరణ చదివి సభకు వినిపించారు.