జగిత్యాల పట్టణ ప్రజలకు కెసిఆర్ కానుక డబల్ బెడ్ రూమ్ ఇండ్లు

Published: Saturday December 17, 2022

ఎమ్మెల్యే డా.సంజయ్

జగిత్యాల, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ అర్బన్ హౌసింగ్ కాలని కెసిఆర్ కాలని నుకపల్లి లో మోడల్ హౌస్ కాలని నీ సందర్శించి, అనంతరం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కు నీటి వసతి సౌకర్యాలను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ పరిశీలించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా 300 కోట్ల తో 4520 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదని అన్నారు. జగిత్యాల పట్టణం లో ఇల్లు లేని నిరుపేదలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబల్ బెడ్ రూమ్ వస్తాయన్నారు. 7 కోట్ల తో డబల్ ఇండ్లకు నీటి సౌకర్యార్థం సంపు, పైప్ లైన్ వేయటం జరిగిందని అన్నారు. 10 కోట్ల తో సీసీ రోడ్లు నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీ, కరెంట్, నీటి వసతుల కల్పన కోసం 25 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. నిజమైన నిరుపేదలు ఆత్మ గౌరవంతో జీవించే విధంగా  డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జగిత్యాల పట్టణ ప్రజలకు కెసిఆర్ కానుక డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, ఈఈ రహమాన్, డిఈ మిలింద్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.