వైద్య ఉద్యోగుల సంఘం 2023 డైరీ ఆవిష్కరణ

Published: Wednesday February 15, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 14 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా అరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్  అనుబంధ సంఘం 2023 డైరీని మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సౌందర్య లత ఆవిష్కరించారు . ఈ కార్యక్రమములో వైద్య సూపర్ వైజర్ బోగ ప్రకాశ్, వైద్య సిబ్బంది ప్రమీల, కరునదేవి, శివ, నగేష్, శ్రీధర్ రెడ్డి, మంగ, సువర్ణ, విక్టోరియా, వనమాల, లక్ష్మి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు