దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం.... --ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

Published: Monday November 07, 2022

జగిత్యాల, నవంబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల ఆర్ప పెళ్లి గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించినారు. అనంతరం గ్రామంలో ముగ్గురూ లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 50 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కోటి 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతు వేదికల నిర్మాణం, 5 వేల ఎకరాలకు ఒక ఎఈఓ నియామకం చేయటం జరిగింది అన్నారు. రైతులు వారి సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. రైతుల పక్షపాతి ప్రభుత్వం టీఆరెఎస్ ప్రభుత్వం అని ఎలాంటి ఇబ్బందులూ ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పిటిసి మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీలత ప్రభాకర్, వైస్ ఎంపీపీ సురేందర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొల శ్రీనివాస్, సోషల్ మీడియా మండల కన్వీనర్ వంశీ, గ్రామ శాక అధ్యక్షులు చిరంజీవి, సీనియర్ నాయకులు రవీందర్రెడ్డి, ఎండబెట్ల ప్రసాద్, నాయకులు గంగారెడ్డి, సురేష్, కిరణ్, మహేందర్, సంతోష్, గంగారాం, మహిళ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.