వానాకాలంలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలి..

Published: Wednesday July 27, 2022
తల్లాడ, జులై 26 (ప్రజాపాలన న్యూస్): మన ఆరోగ్యం,  పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యత ను తెలిపిన జేఎస్ఎస్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ.
జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో  మంగళవారం సత్తుపల్లి మండలంలోని  సిద్దారం, యస్ యస్ పేట, రాజీవ్ కాలనీ, సత్తుపల్లి గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగాజె యస్ యస్ సెంటర్స్ లలో ఆరోగ్యం భద్రత, పరిసరాల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత పై అవగాహన సదస్సును నిర్వహించి లబ్ధిదారులతో వ్యాసరచనలు పోటీలు, కొటేషన్స్ తయారు చేయించారు. ప్రజలందరు విధిగాఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాను పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని జీవనప్రమాణాలకు నష్టం కల్గకుండా ఆరోగ్యాంగా ఉండాలని డైరెక్టర్ సూచించారు.  ఈ కార్యక్రమంలో జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, యస్ కె. రజియా మరియు గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ పెద్దలు పాల్గొన్నారు.