బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు చర్యలు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ** ఆసిఫాబాద్ జిల్లా డిస

Published: Friday December 23, 2022
 ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన షెడ్యూల్డ్ కులాల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం,అదనపు ఎస్పి. అచ్చేశ్వర్ రావుతో కలిసి మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్టి ఎస్సి అట్రాసిటీ కేసులలో బాధితులకు సరైన న్యాయం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఏవైనా మార్పులు,చేర్పులు ఉన్నట్లయితే తెలియజేయాలని అన్నారు. జిల్లాలో రెండు డివిజనల్ కమిటీలు,సబ్ డివిజనల్ కమిటీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో కేసుల పురోగతిపై ఆయా సంబంధిత అధికారులు,సభ్యులతో సమీక్షించారు. జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం తప్పనిసరిగా నిర్వహించడంతో పాటు పౌరుల హక్కులు, బాధ్యులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజస్వ మండల అధికారి రాజేశ్వర్, డి.ఎస్.పి.లు శ్రీనివాస్,కరుణాకర్,జిల్లా అధికారులు సజీవన్, సావిత్రి, మణెమ్మ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేగుంట కేశవరావు, గంగుబాయి, సిడం అర్జు, గోపాల్ నాయక్, గణేష్, వెంకటి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.