బీసీల ఆరాధ్య దైవం, బీపి మండల్ 104 వ జయంతి ** బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ రూప్నర్ **

Published: Friday August 26, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్ట్ 25 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంస్కరణల ఆరాధ్య దైవం, బిందేశ్వర్ వరప్రసాద్ బీపి మండల్ 104వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రూప్నర్ రమేష్ మాట్లాడుతూ బిసి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జి, భారత దేశ పార్లమెంట్ సభ్యుడు, సంఘ సంస్కర్త, వెనకబడిన తరగతుల మండల్ కమిషన్ కు చైర్మన్, గా సంచలనం సృష్టించిన మహనీయుడు అని కొనియాడారు. బీసీలు (ఓబీసీలు) సుమారు3600లకు పైగా కులాలకు రిజర్వేషన్స్ అందుతున్నాయని అన్నారు. అంటే బీపి మండల్ చొరవతో ఇచ్చిన కమిషన్ నివేదికనే అని గుర్తు చేశారు. బిపి మండల్  సంకల్పం నెరవేరాలంటే బీసీ ఐక్య పోరాటాలకు నడుంకట్టి నప్పుడే బిపి మండల్ కు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ కుమార్, రైతు సంఘం అధ్యక్షుడు మారుతి పటేల్, నాయకులు సైతం నాగరాజు,తరుణ్, ఆకాష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.