మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

Published: Wednesday September 22, 2021
మల్లాపూర్, సెప్టెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మల్లాపూర్, లియో క్లబ్ ఆద్వర్యంలో మంగళవారం మల్లాపూర్ మండలం కుస్థాపూర్ గ్రామంలో ని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జోనల్ చైర్మన్ చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, సర్పంచ్ సరికేల లక్ష్మి - మహిపాల్ లచే రేకుర్తి (కరీంనగర్) ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించి మొత్తం 150 మంది రోగులను పరీక్షించగా 25 మందికి రోగులకు కంటి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం అని తెలుపుతూ వారి ని ఆపరేషన నిమిత్తం రేకర్తి ఉదార కంటి ఆసుపత్రి కి పంపడం జరిగిందని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మల్లాపూర్ అధ్యక్షులు ఏనుగు రాంరెడ్డి తెలిపారు. నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్, స్వామి రోగులను పరీక్షించి వారికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, శివ శ్రీనివాస్, సాదుల వెంకటస్వామి, బోయిని సిద్దయ్య, కనుక సంజీవ్, రుద్ర రాంప్రసాద్, దేవా మల్లయ్య, ముత్యాల రమేష్, ముష్కరి రాహుల్, రాజేశ్వర్ లయన్, లియో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.