ఆర్గానిక్ ఫామింగ్ ను ప్రోత్సహించాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్య

Published: Tuesday May 18, 2021
వికారాబాద్ మే 17 ప్రజాపాలన బ్యూరో : ఆర్గానిక్ ఫామింగ్ ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లు సంయుక్తంగా తెలిపారు. సోమవారం ధారూర్ మండల సమీపంలో ఆర్గానిక్ ఫామింగ్ ను సందర్శించారు. ఆ ఫామింగ్ లో పండిస్తున్న కూగాయలను, పంటలను చూసి ఏ ఎరువులను వాడుతున్నారో అక్కడి రైతును అడిగి తెలుసుకున్నారు.