27 న రెడ్డి మహా సంగ్రామ సభ

Published: Monday May 02, 2022
 తెలంగాణ  రెడ్డి ఐక్య వేదిక
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : రెడ్డి కులస్తుల సమస్యలు వాటి పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ ను సిద్ధం చేసేందుకు ఈ నెల 27 మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద గల ఏ జి ఎస్ డెవలపర్స్ లో రెడ్డి సంగ్రామం పేరుతో భారీ బహిరంగంగా సభను నిర్వహిస్తున్నట్లు  రెడ్డి ఐక్యవేదిక పేర్కొంది. ఈ మేరకు ఆదివారం మాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన గోడపత్రిక ను విడుదల చేశారు. అనంతరం ఐక్య వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంతోష్ రెడ్డి,తిరుపతి రెడ్డి లు మాట్లాడారు.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రెండు వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో జనరల్ గురుకుల ను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి విద్య, వైద్యం ఉచితంగా అందించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు ఈ ఈ మహాసంగ్రామం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెడ్డి కులస్తులు ఈసం గ్రామసభకు తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు సుమన్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, సంగీత రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.