అనాధ ఆశ్రమంలో అన్నదానం

Published: Friday August 05, 2022

మధిర రూరల్ ఆగస్టు 4 ప్రజా పాలన ప్రతినిధిమానవ సేవే మాధవ సేవ అంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మధిర రెస్క్యూ టీం సారథ్యంలో నిర్వహిస్తున్న ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో పట్టణ యువ వ్యాపారవేత్త కోన శ్రీధర్ జన్మదినం సందర్భంగా గురువారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనాధ శరణాలయం డైరెక్టర్ ఆర్కే జ్యోతి మాట్లాడుతూ మానవతా దృక్పథంతో అనాధ శరణాలయంలో ఉంటున్న వృద్ధులకు పేదలకు  అన్నదానంకు ఆర్థిక సహాయం అందించిన చేసిన  దేవరపల్లి సుబ్రహ్మణ్యం కోనా జగదీష్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మధిర ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ దోర్నాల రామకృష్ణ  ఆర్కె సుదర్శన్ రామారావు  పాల్గొన్నారు.