కాజీపురం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో.రూరల్ ఎస్సై నరేష్

Published: Tuesday November 22, 2022

మధిర రూరల్ నవంబర్ 21 ప్రజాా పాలన ప్రతినిధిమండల పరిధిలోని కాజీపురం గ్రామంలో సోమవారం నాడుపాలిటెక్నిక్ కళాశాలలో  రూరల్ ఎస్సై నరేష్ విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రాగింగ్ దూరం ఉంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తుఉన్నట్లే విద్యార్థిని, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి అని, సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ విద్యార్థులకు చదువుకు సంబంధించిన సూచనలు చేయాలని,ర్యాగింగ్ దూరంగా ఉండాలని సూచన చేశారు.కళాశాలకు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలోప్రవర్తించకూడదన్నారు.కొంతమంది విద్యార్థులు సున్నిత మనస్ఫస్తులై ఉంటారని, ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితిలో నెలకొంటాయన్నారు. ర్యాగింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. చదువు పట్ల శ్రద్ధ వహిస్తే  భవిష్యత్తు బంగారం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.