సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నారిసేన గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ సంస్థ

Published: Tuesday March 02, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తోటి పేద మహిళలకు సేవ చేయాలనే సంకల్పంతో నారిసేనా గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ సంస్థ అని వ్యవస్థాపకురాలు లతా చౌదరి అన్నారు. సమాజంలో వెనుకబడిన మహిళలను చైతన్య పరచడం కోసం ఏర్పాటు చేసిన నారిసేన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిరు పదాలకు సాయం చేయడం కోసం వివిధ రకాల వస్తువులు సేకరించి అవసరం ఉన్న వారికి అందజేస్తున్నామని తెలిపారు. నారిసేన గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ మరియు జ్యోతి విద్యాలయ హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రోజు శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు బట్టలు, బిస్కెట్లు అందజేశారు. ఇంట్లో వాడే వస్తువులు సేకరించి అవసరం ఉన్నవారికి అందజేయడం ఫోరమ్ లక్ష్యమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు విస్తరించడం కోసం మహిళలకు ఉచితంగా వివిధ రకాలైన టైలరింగ్, పెయింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ , కాలంకారి, డాల్స్ మేకింగ్ వంటి కలనైపుణ్యాలను వెలికి తీసి వారిని నిష్ఠార్థులుగా తయారు చెపిస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన 150 మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ స్థిర పడ్డారని తెలిపారు. అలాగే వారి సమస్యలు తీర్చడానికి న్యాయ సలహాలు అందించడానికి లీగల్ సెల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో, 50 వేల మంది ఈ ఫోరమ్ లో పని చేస్తున్నారని ఆమే తెలిపారు. జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్స్ పల్, ఫోరమ్ అడ్మిన్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ మా స్కూల్ తరుపు నుండి కూడా సిబ్బందిని, తల్లిదండ్రులను సేవలో భాగస్వాములను చేస్తూ, తమకు తోచిన విధంగా సహాయ సాకరలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 5 వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో ఇలా వస్తువుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి టీమ్ లీడర్స్ మణిప్రభ, దివ్యజ్యోతి, యశోద, చందనగర్ టీమ్ లీడర్స్ నీలం సౌమ్య, ఆలేఖ్య, శాంతి, విధ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.