*ఉప్పరి గూడ గ్రామన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని సర్పంచ్ బూడిద రాంరెడ్డి

Published: Saturday November 26, 2022

ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండడంతో ఉప్పరిగూడ వ్యవసాయ భూములు పూర్తిగా నీళ్లలో ఉండడం వల్ల రైతుల కు మరియు రైతు కూలీలకు ఉపాధి కోల్పోయిన సందర్భంలో ఆయకట్టుకు నీరు వదలడం అయినా లేదా అలుగు కొంతమేర తగ్గించి నిర్మించడమైన చేయాలని ఈరోజు సర్పంచ్  ప్రవేశపెట్టిన తీర్మానంపై ఏకగ్రీవంగా గ్రామ రైతులు సంతకాలు చేయడం జరిగింది
అనంతరం  BRRఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలో నియమించిన ఇద్దరు ప్రైవేట్ టీచర్లకు రెండు నెలలకు గాను 20వేల రూపాయలు మరియు  వెంకటేశ్వర ఆలయం అర్చకులు పంతులు గారికి కొన్ని నెలల జీతం 42 వేల రూపాయలు ఈరోజు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీ డి మరియు ఏపీవో ఉపసర్పంచ్ వార్డు సభ్యులు కో ఆప్షన్ సభ్యులు కార్యదర్శి కారోబారు టెక్నికల్ అసిస్టెంట్ మరియు అధికారులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు,