సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ చైర్మన్ మొండి తోక లత

Published: Saturday August 20, 2022

మధిర  జులై 19 ప్రజా పాలన ప్రతినిధి వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నాలుగో వార్డులో ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎవరికి వారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని  పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు అదేవిధంగా వర్షపు నీరు గానీ మురికి నీరు గానీ నివాస ప్రాంతాల్లో నిల్వ ఉండకుండా  చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు