పుష్యమాస ఉత్సవాలలో మంత్రి సతీమణి సందడి,

Published: Monday January 10, 2022

ఎల్ ఎం ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత

వెల్గటూర్, జనవరి 09 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలములోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటిలింగాలొని కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణములో ఆదివారం రోజున జరిగిన పుష్యమాస ఉత్సవాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్ ఎం ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత సందడి చేశారు. ధర్మపురి వాస్తవ్యులైన శారద మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పుష్యమాస ఉత్సవాలలో మంత్రి సతీమణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారద మహిళా శారద మహిళా మండలికి చెందిన మధ్వాచార్య విజయ లక్ష్మి రామ కిషన్, ఓరుగంటి రాధిక మాధవ్ ఆచార్యలు తమ తమ ప్రాచీన ఆచార వ్యవహారాలలో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. అంతకుముందు ఉత్సవాలకు విచ్చేసిన మంత్రి సతీమణికి ఆలయ చైర్మన్ పదిరి నారాయణరావు అర్చకుల తో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆమెకు శాలువాతో సత్కరించారు. అర్చకులు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేసి ఆశీర్వదించారు. అనంతరం ఎల్లంపల్లి జలాశయంలో బోటింగ్ చేస్తూ ప్రజాపాలనతో మాట్లాడారు మాట్లాడుతు కోటిలింగాల ఎంతో విశిష్టమైన ప్రదేశము ఇది తెలుగు జాతి ఔన్నత్యాన్ని గుర్తు చేస్తుందని ఆమె తెలిపారు. మంత్రి గారు ప్రదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా కోటిలింగాల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ గ్రామంలో బ్రాహ్మణులతో కలిసి సహపంక్తి భోజనం భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, మధు శంకర్ శర్మ, పెండ్యాల రాజేష్ శర్మ, ధర్మారం తెరాస నాయకురాలు కనకలక్ష్మి, పెగడపల్లి తె.రా.స నాయకురాలు ఇందిరా, ఆలయ అర్చకులు సంజీవ్, నాగరాజు, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.