ఘనంగా జరిగిన కెసిఆర్ 67వ పుట్టినరోజు వేడుకలు

Published: Thursday February 18, 2021
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అరవై ఏడోవ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రోజున చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కినబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చర్ల లో ఉన్నటువంటి వారి యొక్క కాంప్లెక్స్ లో  కేక్ కట్టింగ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ సొసైటీ చైర్మన్ అన్ని రాంబాబు గారు మాట్లాడుతూ   ఉన్నాయని  దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి  చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు తెలిపారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నక్కిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ పుట్టినరోజు  వేడుకలలో భాగస్వామి నవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉందని అలాగే ఆయన చేపట్టిన ఎన్నో పథకాలు ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి చేసినటువంటి సేవలు మరువలేనివని రాష్ట్రమంతా చుక్క నీరు కూడా వృధా అవకుండా అన్నీ అనుకూల ప్రదేశాలలో చెక్డ్యాంలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేయించి ఎన్నో లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ  ప్రాంతాలకు విడుదల చేసి  రాష్ట్రమంతటా పచ్చదనాన్ని నింపారు. అలాగే 24 గంటల త్రీ ఫేస్ మోటార్ లైన్ సదుపాయం కల్పించి రైతులకు ఎంతో మేలు చేశారని అలాగే 60 సంవత్సరాలు నిండిన టువంటి ప్రతి ఒక్క, వికలాంగుల అయితే మూడు వేల రూపాయలు వారి యొక్క ఖాతాలో రెండు వేల రూపాయలు  జమ చేస్తున్నారని అలాగే రైతులకు రైతుబంధు వారి యొక్క ఖాతాలో  జన అవుతున్నాయని తెలియ పరచడం జరిగింది. ఇంతకుముందు ఆడపిల్ల పుడితే ఆడపిల్లలకు పెళ్లి చేయాలి అంటే భయమేసేది అని కానీ ఈ యొక్క కెసిఆర్ పాలనలో ఆడపిల్లకు పెళ్లి కానుక గా   కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆ యొక్క పెళ్లి కూతురుకు ఒక కుటుంబ పెద్దలా ముందుండి సాయం చేస్తున్నారని. భారతదేశంలో లేనటువంటి సంక్షేమ పథకాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని సభాముఖంగా తెలియజేశారు. అభివృద్ధి పనులు చేపట్టిన అటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ పై  ప్రతిపక్షాల విమర్శలకు బిజెపి,కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. వారం కిందట చర్ల మండలం లో కాంగ్రెస్ నేతలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మను  తగల పెట్టటం చాలా బాధాకరం అని ఆమె చేసిన నేరం ఏంటి సత్యనారాయణపురం సొసైటీ తరఫున మన గిరిజన ప్రాంతాల్లో ఒక ఆయిల్ బంకు ని మంజూరు చేయించి ప్రారంభించడం అయన చేసిన తప్పు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నేతలకు పిచ్చెక్కిపోయి వాళ్లు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు ఇకనైనా  వారి యొక్క పద్ధతి మార్చుకోవాలని  తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో చూడాలని ప్రజలు దీనిని గమనిస్తున్నారని హర్షం వ్యక్తం చేసారు . తదనంతరం కొయ్యురు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పోట్రు బ్రహ్మానంద రెడ్డి, సొసైటీ నెంబర్ పెనుమచ్చ సీతాపతి రాజు, చర్ల సొసైటీ నెంబర్ యాదాల రాంబాబు, సత్యనారాయణ పురం సొసైటీ నెంబర్  జగన్, కేశవాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కోరం నాగేంద్ర, గొమ్ముగూడెం సర్పంచ్ పొడియం మురళి, కేశవాపురం పంచాయతీ ఉప సర్పంచ్ గోసుల మురళి,  పెద్దిపెల్లి గ్రామపంచాయతీ వైస్ సర్పంచ్ బల్లిపాటు రాజుగారు రైతు కోఆర్డినేటర్ మెంతుల నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తోట మల్ల రవి గంధం రాజు తదితరులు పాల్గొన్నారు.