కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం...

Published: Monday August 02, 2021
జగిత్యాల, ఆగస్టు 01 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని జమతే ఇస్లాం హిందు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫిర్డోస్ తరున్నం ఆసియా సుల్తానా జమతే-ఇస్లాం-హింద్ అధ్యక్షులు ఇమాద్ ఉద్దీన్ ఫాజల్ సెక్రటరీ ఖదీర్ షబీర్ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ మీర్ ఖజిమ్ అలీ నాయకులు సుల్తానీ అహ్మద్ మొహమ్మద్ గౌస్ కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.