వీఆర్ఏ ల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ

Published: Tuesday July 26, 2022
మధిర జూలై 25 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మధిర మండల తహసిల్దార్ కార్యాలయం ముందు తమ హక్కుల సాధన కోసం వీఆర్ఏలు చేపడుతున్న నిరవధిక సమ్మెకు మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ *అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా* ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా *మిర్యాల వెంకటరమణ గుప్తా* మాట్లాడుతూ కేసీఆర్  బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలను మోసం చేసిండు అనినోటికి వచ్చిన హామీలు అన్ని చెప్పి వాటిని అమలు చేయడం లో టీర్ యెస్  ప్రభుత్వం విఫలమైందని అన్నారు వారి సమస్యలు పట్టించుకోకుండా వదిలేసిందని వారి ప్రధాన డిమాండ్లు అయినా *పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలనిఅర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల స్థానంలో వారసులకు ఉద్యోగం ఇవ్వాలని* ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర శాసనసభ్యులు *మల్లు భట్టి విక్రమార్క దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి వీఆర్ఏల డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావించేలా చూస్తామని వీఆర్ఏలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ *మునుగోటి వెంకటేశ్వరరావు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* కాంగ్రెస్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాసరావు, పుట్ట పుల్లారావు, కోట నాగరాజు, బోల్లెద్దు రాజేంద్రప్రసాద్, బండారి నరసింహారావు* మొదలగువారు పాల్గొన్నారు