కరోనా రోగులకు డాక్టర్లు ప్రేమ మనోధైర్యం అందించాలి - జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Wednesday May 12, 2021
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మందులు సంజీవనిలా పనిచేస్తున్నాయి
జగిత్యాల, మే 11 (ప్రజాపాలన ప్రతినిధి):  జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ జిల్లాలో కరోనా బారినపడిన రోగులకు అందిస్తున్న మెరుగైన వైద్యం గురించి జిల్లా వైద్య అధికారి డా.పుప్పాల శ్రీధర్ మరియు జిల్లా ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.సుదక్షిణాదేవి ఆర్ఏంఓ డా.రామకృష్ణతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇంటింట సర్వేచేసి ముందస్తు జాగ్రత్తగా కరోనా బారిన పడకుండ వారికి డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటు మెడికల్ కిట్లు అందజేయాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉంటు పేషెంట్లతో ప్రేమ పూర్వకంగా మనోధైర్యం మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే  మందులు సంజీవనిలాగా పని చేస్తున్నాయని కరోనా రెండవ దశను నియంత్రణ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భౌతిక దూరం పాటించి చేతులు శుభ్రంగా కడుక్కోని మస్కులు ధరించి మంచి పోషకాహారం తీసుకోని ముందు జాగ్రత్తలు పాటించడమే శ్రీరామరక్ష అని జిల్లా ప్రజలందరికీ వసంత సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో సంధ్యారాణి పాల్గొన్నారు.