తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలి : తూళ్ళ నరసింహ గౌడ్

Published: Thursday September 16, 2021
ఇబ్రహింపట్నం, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపల్ లో బుదవారం బిజెపి అధ్యక్షులు తూల నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం 17 సెప్టెంబర్ న ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడానికి తుర్కయంజాల్ ఆర్ డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఆర్ డి ఓ ఏవో కి మెమోరండం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన సెప్టెంబర్ 17ను విమోచన దినం గా ప్రభుత్వమే నిర్వహించాలని ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా నేటి ముఖ్యమంత్రి పాల్గొన్నారని గుర్తు చేస్తున్నాం మతోన్మాద ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లను సృష్టించి ప్రజలపై లెక్కలేనన్ని చెప్పరాని అత్యాచారాలను జరిపించారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి తానే రాజు నని స్వతంత్ర రాజుగా ఉంటానని నిజాం సర్కారు ప్రజలపై అకృత్యాలు అత్యాచారాలు పెరిగిపోవడంతో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ చొరవ తీసుకొని భారత భద్రత దళాలను పంపి పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి గావించారు. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం 17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి తెలంగాణ విముక్తి దినం 17 సెప్టెంబర్ ను సెలవు దినంగా ప్రకటించాలి. ఈ యొక్క డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం అతి తొందరలో ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ వారు కోరడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా ఇంచార్జ్ బోసు పల్లి ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లచ్చి రెడ్డి, రాష్ట్ర కిసాన్మోర్చా ఆఫీస్ ఇంచార్జి నల్లవెల్లి నిరంజన్, రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బచ్చగల రమేష్, రంగారెడ్డి జిల్లా కోశాధికారి కొత్త రామ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా నాయకురాలు తూళ్ళ వసంత తదితరులు పాల్గొన్నారు.