దామగుండం అడవిలో వేటగాళ్ళ చేతిలో బలైన దుప్పి

Published: Tuesday March 30, 2021

వికారాబాద్ మార్చి 29, ప్రజాపాలన  ప్రతినిధి : అటవీ శాఖ అధికారుల నిఘా లోపం కారణంగా వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలోని పూడూరు మండలానికి చెందిన దామగుండం అటవీ ప్రాంతంలో జింక మృతి చెందిన విషయాన్ని స్థానికులు గమనించి తెలిపిన వివరాల ప్రకారం.. దామగుండం అడవిలో పశువుల కాపరులు పశువులను మేపుతుండగా దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూశారు. జింకను వేటాడి చంపి దాని కళేబరాన్ని వదిలేసిన దృశ్యాన్ని చూశారు. ఈ విషయాన్ని పూడూరు గ్రామస్తులకు తెలియజేయగా కనకమ్మ లొద్ది ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఈ అటవీ ప్రాంతంలోనే గత మూడు నెలల క్రితం జింక అనుకొని గోమాతను షూట్ చేసిన ఘటన తెలిసిన విషయమే. ఆ ఘటన మరువకముందే వేటగాళ్లు జింకను చంపడం అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల రక్షణ కలకలం రేపుతుంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి గట్టి బందోబస్తు నిర్వహిస్తే మిగిలి ఉన్న వన్యప్రాణుల బ్రతికి బట్ట కడతాయి గ్రామస్తులు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు నిద్ర మత్తు నే నిర్లక్ష్యాన్ని వీడి మూగ జీవాలను రక్షించాలని గ్రామస్తులు వేడుకున్నారు.