రాయికల్ పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన- ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Saturday September 24, 2022

రాయికల్, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలో 'మనబస్తీ మనబడి' కార్యక్రమంలో భాగంగా జిల్లా మరియు మండల పరిషత్ హైస్కూల్  కాంప్లెక్స్ లో 1కోటి 31 లక్షల రూ:లతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్. అనంతరం పట్టణానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను 3ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి,రాయికల్ పట్టణ పెద్దచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100% రాయితీతో 1లక్ష 40వేల ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన, అనంతరం రాయికల్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో డివైడర్లలో మొక్కలు నాటిన తరువాత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవల డెంగ్యూ జ్వరాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హనుమాన్లు,జడ్పిటిసి అశ్విని జాదవ్,వైస్ చైర్మన్ రమాదేవి,జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్,నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణరెడ్డి, డివిజనల్ ఇంజనీర్ భాస్కర్,మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్,మండల విద్యాధికారి గంగాధర్ కౌన్సిలర్లు, అధ్యాపకులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area