కోతకు గురైన కల్లూరు లింక్ రోడ్డు

Published: Tuesday July 27, 2021
కోరుట్ల, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్లూరులోని లింక్ రోడ్లు కిలో మీటర్ మేర కోతకు గురై వ్యవసాయ పొలలో వరద ప్రవాహం ఎక్కువగా వెళ్ళడం ద్వారా పొలాలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లూరు గ్రామంలోని  పంచాయతీరాజ్ రోడ్డు కల్లూరు నుండి సాతారం మరియు గుండంపల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన లింకు రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు కిలోమీటర్ వరకు ఉన్న మట్టి రోడ్డు మొత్తం వరద తాకిడికి కొట్టుకుపోవడం జరిగిందని గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య తెలియజేశారు. ఈ రోడ్డుకి ఆనుకుని ఉన్నా కల్లూరు గ్రామ పాల చెరువు క్రిందనున్న చిన్న తరహా మత్తడి ప్రక్కన చెరువు కట్ట తెగి  చెరువు నుండి రైతులకు వెళ్లే ప్రధాన కాలువ చీలిపోయి పెద్ద వాగులో నీరు వృధాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.పంచాయతీ రాజ్ శాఖఅధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి మరమ్మతులు చేయాల్సిందిగా, గ్రామ రైతులు, గ్రామ సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.