అంగన్వాడి స్కూల్ కి ప్రహరీ గోడ నిర్మించండి,

Published: Friday April 29, 2022
మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్
బెల్లంపల్లి ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలోని శంషేర్ నగర్లో ఏర్పాటుచేసిన  అంగన్వాడి పాఠశాల చుట్టూ ఇల్లల్లోని మరియు వర్షపు నీరు చేరి మురుగు వాసన వస్తుందని, వెంటనే  పాఠశాల చుట్టూ ప్రహరి గోడ నిర్మించాలని మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి, కొలిపాక శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కు, ఛైర్మెన్ కు, సి డి పి ఓ, కు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడి పాఠశాల చుట్టూ నీరు చేరడం వల్ల దుర్గంధం వ్యాపిస్తూ పాఠశాలకు వచ్చే పిల్లలకు, మరియు ప్రభుత్వం ద్వారా అందించే, కోడి గుడ్లను, పోషక పదార్థాలను తీసుకోవడానికి వచ్చే, గర్భిణీ స్త్రీలు అనారోగ్యం పాలవుతున్నారని, కావున అంగన్వాడి స్కూల్  చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, మున్సిపల్ కమిషనర్, చైర్మన్ మేడం, సి డి పి ఓ, అంగన్వాడి పాఠశాలను సందర్శించి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.