తెలుగుదేశం కార్యాలయంలో లోఘనంగా జ్యోతిరావు పూలేజయంతి వేడుకలు

Published: Tuesday April 12, 2022

మధిర ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడుపూలే నాగురువు అని పేర్కొనిన డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ దేశంలో మొట్టమొదటి గా 9 మందితో బాలికా పాఠశాల ఏర్పాటు చేసిన పూలే 170 ఏళ్ళ క్రితమే కొన్ని వర్గాల ఆధి పత్యానికి, దూరాచారాలకు, వివక్షతకు, వ్యతిరేకంగా బహుజనులను చైతన్యపరచి సామాజిక మార్పుకు న్యాయానికి పాటు బడిన మేధావి పూలే. అప్పట్లోనే కౌన్సిలర్ గా ఎన్నికయి ప్రజలకు సేవలందించి అనాధ పిల్లలను చేరదీసి ఉన్నత విద్యావంతులను చేసిన మహాత్ముడు పూలే అందుకనే ప్రపంచ మేధావి భారతరాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేత్కర్ పూలేను నాగురువు అని పేర్కొన్నారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సమావేశంలో మాట్లాడుతూ అన్నారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ పరంగా అభివృద్ధి, సంక్షేమ పరంగా బడుగులకు బహుజన్లకు పెద్దపీఠ వేశారు ఇది అందరూ ఒప్పుకున్న నిజమేనని రామనాధం అన్నారు అటు తరువాత అదేవిధానాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారని అని రామనాధం అన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జ్యోతిరావు పూలే 196వ జయంతి పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు అధ్యక్షతన, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణరాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్. వాసిరెడ్డి రామనాథం గారు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంకా రామనాధం మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త, రచయిత అని, బడుగు బలహీన వర్గాలకు, మహిళల విద్యకు, వితంతువుల అభ్యున్నతికి పాటు పడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు, ఖమ్మం పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు వంగాల రామకోటి, మధిర రూరల్ మండల అధ్యక్షులు మార్నిడి పుల్లారావు, వార్డ్ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, నాగులవంచ శ్రీనివాసరావు, గూడెల్లి నాగయ్య, సీనియర్ నాయకులు మేడా వెంకటేశ్వర చిరపంగిఆశీర్వాదం, తెలుగు యువత సభ్యులు, అనుమోలు సతీష్ గుమ్మా ప్రశాంత్, శ్రీనివాస రావు, సట్టు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు